కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 1లక్ష 25 వేల మొక్కలు నాటారు. తెలంగాణా ఉద్యమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మానకొండూర్ నియోజకవర్గంలో అంబరాన్నంటాయి నియోజకవర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో మరియు మానకొండూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, పోచంపల్లి మాడల్ స్కూల్ ఆవరణలో కేసీఆర్ జన్మదినం సంధర్బంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొక్కలు నాటి కేక్ కట్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ పిలుపులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 1 లక్ష 25 వేల మొక్కలు నాటడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.