ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా APCPDCL మొత్తం 86 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-1 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలులో ఖాళీలున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. మే 3 తో ముగియనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://apcpdcl.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులున్న యెడల వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. 2021 మే 10 వతేదీ నుంచి నుంచి మే 14తేదీ లోపున దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకోవచ్చు.ఇక హాల్‌టికెట్స్ మే 18వ తేదీ 2021 నుంచి మే 22 వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ను మే 23 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు. మే 23 ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 31న ప్రకటించనున్నారు.