రిపేర్ కోసం ఇచ్చిన ఐఫోన్‌లో ఉన్న యువతి నగ్న ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో యాపిల్ సంస్థ 36 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని ఒరేగావ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఐఫోన్ పాడైపోవడంతో 2016లో పెగట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న ఐఫోన్ సర్వీస్ సెంటర్‌లో మరమ్మతు కోసం ఇచ్చింది.
ఫోన్‌ను మరమ్మతు చేసిన అక్కడి టెక్నీషియన్లు అందులో ఉన్న యువతి నగ్న ఫొటోలు, వీడియోలు చూసి వాటిని కొట్టేసారు . అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన యువతి స్నేహితులు విషయాన్ని ఆమెకు చేరవేయడంతో దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి కోర్టుకెక్కింది. పరిహారంగా 5 మిలియన్ డాలర్లు (రూ. 36 కోట్లు) ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో యాపిల్ ఆ మొత్తాన్ని యువతికి పరిహారంగా చెల్లించింది. యాపిల్ చెల్లించిన ఈ సొమ్మును సర్వీస్ సెంటర్ పెగట్రాన్ నుంచి రాబట్టుకున్నట్టు తెలుస్తోంది.