జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శ్రీమంతులు బజారున పడొచ్చు… సామాన్యుడు అందలానికి ఎక్కొచ్చు. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు చోటుకుంది. ప్రపంచంలోని శ్రీమంతుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరురు ప్రమోద్ మిట్టల్ దివాళా తీశాడు. లండన్ కు చెందిన ఈ వ్యాపారవేత్త వేలాది కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు రూ. 24 వేల కోట్ల అప్పులు ఆయనకు ఉన్నట్టు తేలింది.ప్రమోద్ మిట్టల్ 2013లో తన కూతురు వివాహాన్ని జరిపించాడు. ఆ వివాహాన్ని చూసి జనాలంతా ఆశ్చర్యపోయారు. దాదాపు రూ. 500 కోట్లను పెళ్లి కోసం ఆయన ఖర్చు చేశారు. అలాంటి ప్రమోద్ మిట్టల్ ఇప్పుడు దివాళా తీశారు.2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరపున ఆయన హామీ సంతకం పెట్టారు. అయితే జీఐకేఐఎల్ సంస్థ రుణాలను చెల్లించలేకపోయింది. దీంతో, అప్పులు ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ మిట్టల్ ను కోర్టుకు లాగింది. ఇంత మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆయన దివాళా తీశారు.