కరీంనగర్ జిల్లా ది రిపోర్టర్ టీవీ తెలుగు న్యూస్ : శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి బృందం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని గోపాల్ పూర్ కు చెందిన భూక్యా రమేష్ తన సొంత వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురయ్యాడు ఈ ప్రమాదం కాలు , చెయ్యి కోల్పోవడం జరిగింది. బతుకు జీవనం కొనసాగించడం కష్టంగా మరి పూట గడువడం ఇబ్బంది ఉన్నట్లు సోషల్ మీడియా లో వీడియో వైరల్ కావడం చుసిన గల్ఫ్ సేవ సమితి సభ్యులు తడకపెల్లి శ్రీపాల్ బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఒక భరోసా కల్పించి . ఆ కుటుంబానికి శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి తరుపున 15000/-రూపాయలు ఆర్థికసహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు వేముల శంకర్ , అధ్యక్షులు గైని సురేష్ ,ఉపాధ్యక్షులు మరుపాక ఎల్లయ్య , ప్రధాన కార్యదర్శి బి భాగ్యశ్రీ , కార్యదర్శి దేవసేన, సహాయ కార్యదర్శి బోనగిరి రాజేందర్, కోశాధికారి నల్లగొండ బాబు మీడియాఇంచార్జి ఐతాబత్తుల అనుశ్రీ ,ఉత్కం తిరుపతి గౌడ్,ప్రేమ ,చెట్టిపెల్లి లక్ష్మి రాజ్యం,దొంతి రాము,రాంపురి రాజశేఖర్,రమేష్ ,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
