కరోనాతో మరో జర్నలిస్టు బలయ్యాడు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
టీఎన్ఆర్ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. యూట్యూబ్ వేదికగా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ముక్కుసూటిగా ఆయన సంధించే ప్రశ్నలకు అతిథులు కూడా ఆశ్చర్యపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపాలను ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు