కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంట పల్లి గ్రామానికి చెందిన నవయుగ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ బామండ్ల రవీందర్ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు తన సొంత బైక్ కు మైక్ లను అమర్చి గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట, కోహెడ, హుస్నాబాద్,చిగురుమామిడి, తిమ్మాపూర్,మానకొండూర్, శంకరపట్నం,కరీంనగర్, కొత్తపల్లి,బోయినిపల్లి మండలాల్లోని 100 గ్రామాలు పూర్తిచేసుకొని తన సొంత మండలానికి ఆదివారం రోజు చేరుకున్నాడు ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచంలోని సుమారు 190 దేశాలకు పైగా గజ గజ వణుకుతున్న తరుణములో ప్రజలు మహమ్మారి వైరస్ ను కట్టడి చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ తప్పనిసరి అయితేనే నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించాలని దుకాణాల వద్ద ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా బామండ్ల రవీందర్ చేస్తున్న ప్రచారానికి పలువురు అభినందనలు తెలిపారు