ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం జిల్లాలోనే నమోదవుతుండడం ప్రజలను భయకంపితులను చేస్తోంది.శనివారం-ఆదివారం మధ్య రాష్ట్రవ్యాప్తంగా 58 కేసులు నమోదైతే అందులో 30 మంది కర్నూలు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 466కు పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ కొత్తగా 11 మందికి వైరస్ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 319కి పెరిగింది. 266 కేసులతో కృష్ణా మూడో స్థానంలో ఉండగా, నెల్లూరు (91), కడప (83) టాప్-5లో ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళంలో ప్రస్తుతం ఐదు కేసులు నమోదయ్యాయి.