- బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆధ్వర్యంలో నిర్వహణ
తెలంగాణ-మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి: రెండు దశాబ్దాల బానిస సంకెళ్ళను తెంచుతూ ఇంటర్, డిగ్రీ వ్యవస్థలో కాంట్రాక్టు లెక్చరర్లు గా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బెల్లంపల్లి ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్లు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కాంపల్లి శంకర్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొంకూరి ప్రవీణ్ కుమార్, ప్రదన కార్యదర్శి బండి ప్రసాద్ నాయకులు మేడ తిరుపతి, యం. ఏ. రేష్మ, డాక్టర్ నర్రా ఏకాంబరం, లెక్చరర్స్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తోంగల సత్యనారాయణ, సర్పంచులు, ఎం పీ పీ, ఎం పీ టీ సి లు, జెడ్ పీ టీ సి లు, తదితరులు పాల్గొన్నారు.