కేంద్రప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలు మార్లు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమకుట్టినట్లుకూడా లేదని మండిపడ్డారు.
కేంద్రప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలమంతా ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ మోదీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నాయని ఆరోపించారు. సురేశ్ మాట్లాడుతూ దేశంలోని 6 వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్‌ను పునఃసమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, అంజి, జయం తిగౌడ్, హరీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
\