కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాటం లో ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసి, బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించిన ధీరుడు, అజాద్ హింద్ ఫౌజ్ స్ధాపించి బ్రిటిష్ వారి గుండెల్లో మించిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తీవ్రంగా కృషి చేసి బ్రిటిషర్ల తో పోరాడారని తెలిపారు అలాంటి పోరాటంలో ఎందరో తెరమరుగు కొందరు కనుమరుగయ్యారు అని అని ఇందులో ఎవరికి కూడా బ్రిటిషర్లకు తలవంచని విధంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందువరుసలో ఉంటారని తెలిపారు. బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటం కూడా అవసరమని అని బలంగా నమ్మిన అతివాదుల లో నేతాజీ తొలి వ్యక్తి అని తెలిపారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం అనుసరణీయం అని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవడానికి కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవేందర్ ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు