కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లా రెడ్డి అధ్యక్షతన వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయుటకొరకై సమన్వయ సమావేశం జరిగింది ఎంపీపీ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కృషి చేయాలని కోరారు రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి,ఎమ్మార్వో రాజేశ్వరి ఏపీఎం లావణ్య, ఎంపీడీవో మరియు ఎంపిఓ నరసింహారెడ్డి వ్యవసాయ అధికారి కిరణ్మయి రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు