శనివారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో 30 సిసి కెమెరాలను మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు సిపి కమలాహాసన్ రెడ్డి లు ప్రారంభించారు గ్రామ సర్పంచ్ సమత కార్యదర్శి అశ్విని వారికి పూల మొక్కలు బహూకరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిసి పుటేజ్ ఆపరేటింగ్ సిస్టంను వారు పరిశీలించారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు అలాగే పోలీసు కళా బృంద బృందం ఆధ్వర్యంలో ఆటపాటలతో స్థానికులను అలరించారు ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ జిల్లాలోనే గన్నేరువరం మండలం లో నిఘా భద్రత లో ముందంజలో ఉందని కొనియాడారు ఆడపిల్లల భద్రత ను ప్రస్తావిస్తూ ఆపద పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించాలని పరిష్కారం వేగవంతంగా ఉంటుందని యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు , సిపి కమలాసన్ రెడ్డి సిసి కెమెరాల ఏర్పాటుపై గుండ్లపల్లి పాలకవర్గం మరియు ప్రజలు ఉత్సాహంతో ముందుకొచ్చారని వారు అభినందించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ సర్పంచ్ సమత రాజేందర్ రెడ్డి కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీపీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతాయని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు స్థానిక ఎస్సార్ కే పాఠశాల విద్యార్థినులను ఉద్దేశిస్తూ ఆపద సమయంలో 100 డయల్ చేయాలని అలాగే హ్యాక్ ఐ ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు సిసి కెమెరాల వలన అసాంఘిక కార్యకలాపాలను మరియు ప్రమాదాలను అరికట్టడం సులభతరమవుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక సిఐ మహేష్ గౌడ్ మరియు ఎస్సై తిరుపతిల పనితీరును అభినందించారు రాజీవ్ రహదారి వెంట కరీంనగర్ జిల్లా పరిధి 36 కిలోమీటర్లు కాగా గతంలో2378ప్రమాదాలు జరిగాయని అందులో 827 మంది చనిపోయారని 2017-18 సంవత్సరంలో 12 ప్రమాదాలు జరగగా 5 మంది చనిపోయారని 2018-19 సంవత్సరంలో కేవలం రెండు ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయని వివరించారు ఆ తరువాత పలువురిని సిపి శాలువా కప్పి అభినందించారు అదే విధంగా గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు వంగల నరసింహారెడ్డి సిపిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సిపి కమలాసన్ రెడ్డి తో పాటు రూరల్ ఏసీపీ విజయసారథి సర్పంచ్ బెతెల్లి సమతా రాజేందర్ రెడ్డి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఎంపీటీసీల ఫోరం మండల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ రఫీ పంచాయితీ కార్యదర్శిని అశ్విని ఉపసర్పంచ్ చింతల పద్మ పరశురాములు మరియు నాయకులు పాల్గొన్నారు