గౌరవ డిజిపి గారికి,
సిటీ కమీషనర్ హైదరాబాద్ గారికి,
ఆదివారం 13 ఫిబ్రవరి 2022 సాయంత్రం సుమారు తొమ్మిది గంటల ప్రాంతం లో నేను నా ఆఫీస్ లో సౌండ్ ఇంజనీర్స్ సిస్టమ్స్ కనెక్షన్స్ ఇస్తున్న సమయం లో మాకు ఉన్న కామన్ గేట్ కి పక్క బ్లాక్ ఓనర్ బిల్లకంటి జ్యోతి భర్త పేరు తిరుపతి రెడ్డి తాళం వేసి నిర్బంధించి వెళ్ళిపోయి నన్ను మానసికంగా హింసించడం జరిగింది. వారికి మాకు కామన్ కీ ఒకటే ఉంటుంది. కానీ ఆలా కాకుండా కొత్తగా ఒక తాళం చెవి కొనుక్కొచ్చి తాళం వేసి వెళ్ళిపోయింది. వెంటనే బంజారాహిల్స్ పోలీసువారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి నన్ను ఆ సమయం లో కాపాడారు. సుమారు మూడు గంటలపాటు పోలీసువారు వచ్చినప్పుడు వారితో కూడ గౌరవం లేకుండా దురుసుగా వ్యవహరించడం జరిగింది. సకాలం లో స్పందించి నన్ను కాపాడిన పోలీసువారికి నా కృతఙ్ఞతలు. గతం లో అనగా ఈ నెల ఎనిమిదవ తేదీన బిల్లకంటి జ్యోతి భర్త తిరుపతి రెడ్డి మద్యం సేవించి సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతం లో మా ఆఫీస్ కి వచ్చి బెదిరింపులకు పాలుపడ్డాడు. ఆనాడు కూడా కి కాల్ చేసి సమాచారం ఇవ్వడం తో పోలీసువారు అనగా కానిస్టేబుల్ ఆఫీసర్ రవికిరణ్ వచ్చి పరిస్థితిని గమనించి మందలించి వెళ్లడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎంతోమంది నిరుద్యోగ యువతకు సౌండ్ ఇంజనీరింగ్ , ఎడిటింగ్ , డబ్బింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు చుపిస్తున్నాము. ఎప్పుడుపడితే అప్పుడు తిరుపతి రెడ్డి లేదా అతని భార్య బిల్లకంటి జ్యోతి వచ్చి మమ్మల్ని ఇష్టానుసారిగా మాట్లాడూ ఇబ్బదులకు గురిచేస్తున్నారు.
కావున నన్ను ఆఫిసులో నిర్బంధించి నన్ను మానశిఖంగా హింసించిన బిల్లకంటి జ్యోతి పై కేసు నమోదు చేసి అలాగే మద్యం మత్తులో మా ఆఫీస్ కి వచ్చి బెదిరింపులకు పాలుపడుతున్న తిరుపతి రెడ్డి పై కేసు నమోదు చేసి నాకు తగు న్యాయం చేయగలరని ప్రార్థన.