కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రం పరిధిలోని మఠం కాలనీలోని ఇండ్ల మధ్య రోడ్డుపై గుంతలు పడ్డాయి. వర్షం కురిస్తే నీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ వ్యవసాయ కూలీలు. పాడి రైతులు పాల కేంద్రానికి పాలు పోసేందుకు ఈ రోడ్డు వెంటే వెళ్తారు. గతంలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు తగిన మరమ్మతులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.