చైనా లో కరోనా వైరస్ రోజు రోజుకు ప్రభళుతోంది . చైనా లో 2003 లో సార్స్ వైరస్ ప్రబలింది . దీని కారణంగా ఆ సమయంలో కొన్ని వందల మంది చని పోయారు . ఈ కరోనా వైరస్ కూడా సార్లు వైరస్ ని పోలి ఉందని చైనా లోని పలువురు శాత్రవేత్తలు వెల్లడించారు . ఈ వైరస్ అనేది పక్షులు, పాముల నుండి మనుషులకు వ్యాప్తి అవుతుంది . ఈ వ్యాధి వాళ్ళ మనిషి శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొంటాడు . కొన్ని రోజులలోపే ఆ వ్యాధి కి గురైన వాడు మరణిస్తారు అని శాత్రవేత్తలు తెలిపారు .
కరోనా వైరస్ మొదటగా 1960 లో గుర్తించారు . ఆ కాలంలో ఇది పక్షులు, క్షీరదాలు నుండి వ్యాప్తి చెందింది అని తెలుస్తుంది . తర్వాతి కాలంలో కాలనుగుంగా ఈ వైరస్ వ్యాప్తి కి కారణాలు తెలియట్లే కానీ ఈ వైరస్ లక్షణాలు మాత్రం కొన్ని రకాల ఇతర కారకాల వాళ్ళ వ్యాప్తి / సంక్రమణ జరుగుతుంది . మొదటగా పక్షులు , క్షీరదాలు ద్వారా , తరవాతి కాలంలో సముద్ర జీవాలు నుండి , ఈ మధ్య కాలంలో పాములు ద్వారా వ్యాపి చెందుతుందని శాత్రవేత్తలు ఒక అంచానికి వచ్చారు . కానీ ఈ రకం వైరస్ కి పూర్తి స్థాయి లో ఏది కారణం , ఎలా వ్యాప్తి చెందుతుంది , దీనికి నివారణ ఇంతవరకు కనుగొనబడలేదు .
ఈ కరోనా వైరస్ ను చైనా ప్రభుత్వం తమ దేశంలో గుర్తించామని అధికారికంగా గుర్తించారు . ఈ వ్యాధి సోకిన వారి రక్త శాంపిల్ ని లండన్ లో పరీక్షలకు పంపిన తర్వాత లండన్ శాత్రవేత్తలు కూడా ఇది ఆ రకం వైరస్ అనే గుర్తించారు . ప్రాధమిక నిర్ధారణ తర్వాత చైనా దేశం వ్యాధి నివారణకు నిధులు మంజూరు చేసారు . దేశ వ్యాప్తంగా కొన్ని నగరాలలో ఈ వైరస్ గుర్తించిన చోట అత్యవసర స్థితి మాదిరిగా ఏర్పాట్లు చేసి పలు రకాల వ్యాధి వ్యాపి నిర్ములనకు కృషి చేస్తున్నారు . ఇదే సమయంలో ఇతర దేశాలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )