టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది. థియేట్రికల్ బిజినెస్ పై బడా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఫైనల్ గా నారప్ప టీమ్ అనుకున్నట్లే షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు కూడా సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.
ధనుష్ తమిళ్ మూవీ అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ – ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఇక సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్స్ బిజినెస్ పై అనుకున్నంతగా నమ్మకం కుదరడం లేదు.
ఇక మొత్తానికి అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ రేటుకే సినిమా హక్కులను అంకినట్లు సమాచారం. ఇక నిర్మాత సురేష్ బాబు అధికారికంగా వివరణ ఇస్తూ సినిమాను ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
సినిమాలో సామాజిక అంశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని అలాగే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుందని కూడా అన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.