హైదరాబాద్ నగరంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గమును రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఇట్టి నూతన కార్యవర్గం లో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన సొల్లు అజయ్ వర్మ ను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సొల్లు అజయ్ వర్మ గత 15 సంవత్సరాల నుండి దళిత సంఘాల లో వివిధ హోదాల్లో పని చేసినారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు