కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రంగం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రోబో ట్రాఫిక్ మానిక్యూన్స్ ని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై రోబో సీసీ కెమెరాలను గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి ప్రారంభించారు. సిపి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు గుండ్లపల్లి స్టేజీ వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఈ రోబో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు . ఈ కార్యక్రమంలో గన్నేరువరం పోలీస్ సిబ్బంది , టిఆర్ఎస్ నాయకులు బేతేల్లి రాజేందర్, ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.
