బాబా సాహెబ్ అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనపుడు భారతదేశంలో గల పీడిత ప్రజల సమస్యలపై తన వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. భారత జాతీయులందరికి కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రతినిధి, మీ యొక్క ప్రాతినిధ్యం అవసరం లేనే లేదు అని అంబేడ్కర్ గారిని తిరస్కరించింది. అంబేడ్కర్ తీవ్రంగా పట్టుబడితే, బలహీనవర్గాలకు మాత్రమే మీరు ప్రతినిధిగా వ్యవహరించండి మిగిలిన వారి తరపున కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది, ఈమాత్రం కూడా కాంగ్రెస్ కు ఇష్టం లేదు అని బ్రిటిష్ వారు సలహా ఇచ్చారు.
రాజ్యాంగ పరిషత్ కు జరిగిన ఎన్నికల్లో అంబేడ్కర్ ఎన్నిక కాకుండా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు తీవ్రంగా కృషి చేశాయి. మండల్ లాంటి గొప్ప బహుజన వాదులు అంబేడ్కర్ యొక్క అవశ్యకతను గుర్తించి, తీవ్రంగా శ్రమించి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యేలా చేయగలిగారు. కానీ అంబెడ్కర్ గెలిచిన నియోజకవర్గాన్ని పాకిస్తాన్ లో కలిపేసింది కాంగ్రెస్. అంటే అంబెడ్కర్ ను రాజ్యాంగ సభకు రానివ్వకుండా చేయడానికి నెహ్రు గాంధీలు దేశ భూభాగం సైతం వదులుకున్నారు. కాంగ్రెస్ కుట్రలు కనిపెట్టిన బ్రిటిష్ అంబెడ్కర్ కంటే రాజ్యాంగ రచనా సామర్ధ్యం ఎవరికీ లేదు, కాబట్టి కచ్చితంగా మీరతన్ని ఎంపిక చేయాలని వత్తిడి తెచ్చింది. బాబూ రాజేంద్రప్రసాద్ కూడా అంబెడ్కర్ ఆవశ్యకత ఉంది అని గాంధీ నెహ్రూలకు గట్టిగానే చెప్పాడు. కాంగ్రెస్ లో ఎక్కువమందికి అంబేడ్కర్ సభ్యత్వం ఇష్టం లేదు, మరికొందరు అంబేడ్కర్ ను బలహీన వర్గాల ప్రతినిధిగా మాత్రమే నియమించడానికి ఇష్టపడ్డారు. మరికొంతమంది అభ్యుదయవాదులు రాజ్యాంగ రచనా సంఘానికి అంబేడ్కర్ కంటే అర్హత కలిగిన వ్యక్తి మరొకరు లేరని ఘంటాపదంగా చెప్పగలిగారు. పరిస్థితి మొత్తం అంచనావేసిన అప్పటి మేధావుల మధ్య క్రింది విషయాలపై తీవ్రమైన చర్చ జరిగింది.
1. రచనా సంఘానికి అధ్యక్షత వహించే సత్తా అంబేడ్కర్ కు కాకుండా ఇంకెవరికైనా ఉందా ?
2. రచనా సంఘానికి కాకుండా ఏదైనా ఒక అంశానికి ప్రతినిధిగా ఎంపిక చేయాలా ? అలాగైతే..
3. బలహీన వర్గాల ప్రతినిధిగా మాత్రమే అంబేడ్కర్ ను నియమించాలా?
మొదటి ప్రశ్నకు సులువుగానే సమాధానం లభించింది. అంబేడ్కర్ కు మినహా ఇంకెవరికి అంతా సత్తా లేదు. ఈ సమాదానమే మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా సమాదానంగా సరిపోతుంది. కానీ అంబేడ్కర్ అధ్యక్షత కాంగ్రెస్ లో గల కుహనా మేధావులను సంతృప్తి పర్చగలమా లేదా ? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి తీవ్రమైన మధనం తరువాత వారికి లభించిన ఒక గొప్ప తెలివైన పరిష్కారం ఏమిటంటే…( వారి మాటల్లోనే )
బలహీనవర్గాల ప్రతినిధిగా అంబేడ్కర్ ను కాకుండా మరెవరిని ఎంపిక చేయలేము. అంబేడ్కర్ ను కేవలం బలహీనవర్గాల ప్రతినిధిగా ఎంపిక చేయడమంటే కొరివితో తల గోక్కోవడమే. రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటిష్ వారితో పాటు గాంధీ & కాంగ్రెస్ ను తన మేధస్సుతో, వాధనా పటిమ తో మట్టి కరిపించి తన డిమాండ్ లను నెరవేర్చుకున్న వైనం మనకు తెలిసిందే. అంబేడ్కర్ ను కేవలం బలహీన వర్గాల ప్రతినిధిగా ఎంపిక చేయడం ద్వారా అతని పూర్తి శక్తి యుక్తులు వారి కోసమే వినియోగించి అధిక రాయితీలు పొందగల సమర్ధుడు. ఇది మనకు అంత శ్రేయస్కరము కాదు. అంబేడ్కర్ యొక్క సమయాన్ని, మేధస్సుని అంకితబావాన్ని, పట్టుదల మనకు పూనా ఒప్పంద సమయంలోనే అర్ధం అయింది. అంబేడ్కర్ ఏకాగ్రతను కేవలం బలహీన వర్గాల కోసం కాకుండా, మొత్తం రాజ్యాంగం పై మళ్లించడమే మనకు ఎంతో మేలు చేస్తుంది. అంతేగాక మిగిలిన వారెవ్వరూ రాజ్యాంగాన్ని రాజకీయాలకు అతీతంగా, దీక్షతో వేగంగా పూర్తి చేయలేరు. ఒక మేధావిని ఎన్నుకున్నామన్న కీర్తి, గొప్ప రాజ్యాంగం రెండూ లభిస్తాయి.
అంబేడ్కర్ ను రచనా సంఘానికి అధ్యక్షునిగా ఎంపిక చేయడం స్వయంగా అంబేడ్కర్ ని కూడా అచ్చర్యపరిచింది. కేవలం బలహీన వర్గాల ప్రతినిదిగానే నియమిస్తారని ఊహించారు కూడా. ఏది ఏమైనా అవకాశం ఉన్నంతలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అంధించిన ఘనత ఆ మహానుబావుడిదే. పాకిస్తాన్ విడిపోయిన తరువాత అక్కడ పరిపాలన, రాజ్యాధికారం లో ఏర్పడిన సంధిగ్ద పరిస్థితులు, అల్లర్లను చూసిన అక్కడి మేధావులు మరియు పత్రికలు “ మేము దేశాన్నైతే పొందగలిగేము కానీ, అంబేడ్కర్ లాంటి మేధావి మాకు లేకుండా పోయాడు కదా” అని వాపోయారు.