ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఆదివారం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ప్రమాణ స్వీకరణ అనంతరం సింగిల్విండో చైర్మన్ తన్నీరు శరత్ రావు ప్రమాణ స్వీకారం సందర్భంగా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ వరాల పరుశరాములు ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మైలారం సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ మర్రి వెంకటమల్లు, మాజీ సర్పంచ్ జక్కనపల్లి సత్తయ్య, గన్నేరువరం మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు వరాల మల్లేశం, ఔషధ రాజయ్య, నూకల తిరుపతి, మైలారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కన్నపల్లి వేణు, తదితరులు పాల్గొన్నారు