కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీవో కార్యాలయంలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ శాతం 18 నుండి 45 మధ్య వయస్సు వారు రోడ్ ప్రమాదం లో మృతి చెందుతున్నారని,విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ పైన అవగాహన కల్పించాలని కరీంనగర్ డిటిసి కార్యాలయంలో పిల్లలకు పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని,5000 మంది పిల్లలకు ఈ పార్కులో అవగాహన కల్పించామని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రతి సంవత్సరం సుమారు1,లక్ష 50 వెయిల రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎక్కువ శాతం బైక్ పై వెళ్తున్న వ్యక్తులు మృతి చెందుతున్నారని, రోడ్ ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వెళ్లడం, తాగి డ్రైవ్ చేయడం,వల్ల జరుగుతున్నాయని,దేశంలో మొత్తం 1 సంవత్సరానికి 5 లక్షల ప్రమాదాలు జరుతున్నాయని, మన రాష్ర్టంలో సంవత్సరానికి 22 వెయిల ప్రమాదాలు జరుగుతున్నాయని, 100 ప్రమాదాలు జరుగుతే అందులో 60 ప్రమాదాలు అతివేగం వల్ల జరుగుతున్నాయని, దాదాపు 15 శాతం మంది హెల్మెట్ దరించకపోవడం వల్ల మృతి చెందుతున్నారని, ప్రమాదం జరిగినప్పుడు త్వరగా వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ ధరిస్తే ప్రమాదాలు నివారించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సందీప్ సుల్తానీయ,అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ కమిషనర్ సందీప్ శాండిల్య,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాప రావు, కలెక్టర్ శశాంక,పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి,డిటిసి పుప్పాల శ్రీనివాస్,అధికారులు పాల్గొన్నారు.