తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామక ఫైలుపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర సాధారణ పరి పాలన శాఖ ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు.2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారు. ఎక్కువకాలం పాటు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండటంతోనే సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా ఎంపిక చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాలనలో స్థిరత్వం ఉంటుందని పేర్కొంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference