పిడుగురాళ్ల మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీన పిడుగురాళ్ల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని స్థానిక మండల న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ గురజాల డివిజనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ మంజులత తెలియజేశారు. ఈ అదాలత్ లో రాజీ పడ దగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ కేసులు, భరణం కేసులు పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని పిడుగురాళ్ల మాచవరం మండలాల పరిసరాల కక్షిదారులు సద్వినియోగ పరుచుకోవాలని న్యాయమూర్తి కోరారు.