పేకాట ముఠా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ & తాండూర్ పోలీసులు.
57 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.పరారీలో ఒక్కరు.
6 లక్షల నగదు,18 వాహనాలు,63 సెల్ ఫోన్ లు స్వాధీనం.
పేకాడడం సరాదాగా మొదలై వ్యసనంగా మారుతుండగా అదృష్టం వరిస్తే కాసులు దురదృష్టం వరిస్తే ఒంటిపై గుడ్డలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఎదరవుతుంది. ఇందులో ముఖ్యంగా మూడు ముక్కలాట ఆడుతుండగా ఎక్కువ మంది జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.కష్టపడి డబ్బు సంపాదించాలంటేనే చాలా కష్టం…అయినా అందులో పెద్ద కిక్ ఏముంది అనుకుంటున్నారో ఏమో…కొందరు అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి అనేక ఐడియాలు వేస్తున్నారు. అలా పేకాట ద్వారా కాసులు రాబట్టేందుకు ఓ ముఠా పెద్ద నెట్ వర్కే ఏర్పాటు చేసుకొంది అని ఇందుకోసం ప్రత్యేకంగా కొంత మంది మనుషులు, కొన్ని రహస్య స్థావరాలను సైతం ఏర్పాటు చేసుకొని యథేచ్చగా పేకాట దందా సాగిస్తున్నారు అన్నారు
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట(అందర్-బహార్) ఆడిస్తున్న ఈ ముఠా గుట్టు టాస్క్ ఫోర్స్ & స్థానిక పోలీసులు రట్టుచేయడం జరిగింది అని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రహస్య ప్రదేశాలను గుర్తించి పేకాట ఆడిస్తున్నారని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపల్లివాడ గ్రామ ప్రాంతంలో డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నరనే నమ్మదగిన సమాచారం అందుకున్న గుట్టు టాస్క్ ఫోర్స్ & తాండూర్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించగా 57 మందిని పోలీసులు పట్టుకోవడం జరిగింది.ఒక్కరు పరారీలో ఉన్నాడు అని సీపీ రామగుండం గారు తెలిపారు.
ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ….సప్త వ్యసనాలలో పేకాట ఒకటి. జూద ప్రియులు ఎవరెన్ని చెప్పిన, ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతున్నా పేకాట మాత్రం విడిచిపెట్టరు. పోలీసులు పట్టుకుంటారని తెలిసినా దొంగచాటుగా పేకాట ఆడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు.జూదం ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఈ వ్యసనం ఎన్నో జీవితాలను ఛిద్రం చేసింది. ఏ పని చేసి అయినా ఆటాడాలనే ఆత్రుత అనేది దిగజారేలా చేస్తుంది.పేకాట రాయుళ్లు కొత్త పద్ధతుల్లో ఎవరికీ దొరక్కుండా ఉండటం కోసం మొబైల్ పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
*అసలు సూత్రధారులు.
తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన తరువాత ప్రభుత్వం లా & ఆర్డర్ కి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదాన్ని మోపి అన్ని క్లబ్‌లను అరికట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్‌లు మూతపడ్డాయి.తెలంగాణా లో ఆడడం వీలు కాదని పోలిసుల నిఘా ఎక్కవ ఉండడంతో ఈ పేకాట రాకెట్ కీలక సూత్రధారులు అనుగొండ సుదర్శన్ ,మాదారపు రామారావు .మాదారపు విజయ్ ,మహేందర్ రావు లు పేకాట రాయుళ్ళ వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి అందులో సందేశాలు పంపిస్తూ వారికీ పేకాట అడే ప్రాంతాన్ని తెలియచేస్తారు .వీరు మహారాష్ట్ర లోని రాజురా ,బెంగుళూరు,చతిష్ఘడ్ లోని కుంట ,చంద్రపూర్మొ దలగు ప్రాంతలకు వాహనాలు ఏర్పాటు చేసి పేకాట ఆడు ప్రాంతాలకు తీసుకెల్తారు.డ్రైవర్స్ కి డబ్బులు చేలిస్తూ ఆడడానికి వచ్చిన పేకాట రాయుళ్లకి బిర్యానీలు మద్యం ఏర్పాటు చేస్తారు .
పెద్ద నెటవర్కే ఏర్పాటు చేసుకొని జూద ప్రియులు సాధారణంగా ఏ క్లబ్బులకో వెళ్లి తమ వాంఛను తీర్చుకుంటుంటారు. అదే విధంగా పేకాట రాయుళ్లు శివారు ప్రాంతాల్లోని తోటలలో గతంలో పేకాట ఆడేవారు. పోలీసులు పేకాటరాయుళ్ల పని పట్టడానికి ఇటీవల కాలంలో శివారు ప్రాంతాల్లో ఉన్న తోటలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో పేకాట రాయుళ్లు రూటు మార్చారు అన్నారు. వీరు కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో పటిష్ఠమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా రహస్యప్రాంతాల్లో పేకాట ఆడిస్తున్నారని..దీంతో ఇక్కడ పేకాండేందుకు మంచిర్యాల ,పెద్దపల్లి ,జగిత్యాల ,కరీంనగర్ ,సిద్దిపేట్ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సమచారం తెలిసిందని సీపీ గారు తెలిపారు.
కేసులు పెడుతున్నా మారని అలవాటు పోలీసులు వరుసగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేసినా పలువురు అడ్డాలు మారుస్తూ ఆటను యథావిధిగా కొనసాగిస్తున్నారు. పేకాట కోసం పలు పట్టణ కేంద్రలలో ప్రత్యేక గదులతోపాటు, శివారు ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని, భద్రత సైతం ఏర్పాటు చేసుకున్నట్లు సమచారం సేకరించడం జరిగింది అన్నారు. మరి కొందరు ఏకంగా నివాస ప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకుని మరి పేకాడుతున్నారు. పేకాట ఆడే సమయంలో మద్యం, ఆహారంతోపాటు ఓడిపోయిన వారికి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుడడంతో పేకాట రాయుళ్లు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.
వాహనాలు ఒకచోట.. ఆడేది మరో చోట పేకాట రాయుళ్లు పోలీసుల దాడులనుండి తప్పించుకోవడానికి స్థావారాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఆటస్థలానికి వెళ్లే సమయంలో వాహనాలను రహస్య ప్రదేశంలో ఉంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి మరొకచోట అడ్డా వేస్తున్నారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో ఈ ఆట రెండింతలుగా తయారయ్యింది. పోలీసుల దాడుల్లో దొరికిన వారి తాట తీసినా వారీలో మార్పు రావడం లేదు.
వస్తువులు, వాహనాలు తాకట్టుపెడుతూ పేకాట డబ్బులు పొగొట్టుకున్నా బాధితులకు అప్పటికప్పుడే అప్పురూపేన ఇచ్చేందుకు కూర్చొన్నచోటేనే వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. కొన్ని చోట్ల ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. రూ.5 నుంచి 10కి వడ్డీ రూపం లో తీసుకున్న డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడే ఆడాలని నిబంధలను పెడుతున్నట్లు సమాచారం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు బానిసై డబ్బు పోగొట్టుకున్న ఆవేదనలో మత్తులో మద్యం, గంజాయికి అలవాటు పడుతున్నారనే సమాచారం ఉంది.
కఠిన చర్యలు తప్పవు పేకాట స్థావరాలపై తరుచూ దాడులు చేస్తున్నాం. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో నిరంతరం ఈ ఆటపై నిఘాను పెడుతూనే ఉన్నాం. వారు పట్టుబడిన ప్రతిసారి కేసులు నమోదు చేసిన వారి ప్రవర్తనలో, ప్రవృత్తి లో మార్పులు రాకుండా సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు పేకాట గృహాలను నిర్వహిస్తూ, పేకాట రాయుళ్ల ని ప్రోత్సహిస్తూ వారి జీవితాలు నాశనంకి కారణం అవుతున్న కొంతమంది వ్యక్తుల జాబితా సిద్ధం చేయడం జరిగింది త్వరలోనే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందన్నారు. పేకాడుతున్న వారిపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
పేకాట నిర్వాహకులు:
1. అనుగొండ సుదర్శన్ s/o నాగయ్య 50 ఇయర్స్, రెడ్డి ,4-200/225 ఇందిరమ్మ కాలనీ, కిస్మత్పూర్. రాజేంద్రనగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్
2. మాదారపు రామారావు s/o కిష్టయ్య 46yrs, 1-57/427 శ్రీ రామ్ నగర్ కాలనీ, కొండాపూర్ రంగారెడ్డి
3. మాదారపు విజయ్ s/o వెంకట్రావు 41 ఇయర్స్, ఐ సిటి అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 2109 KPHP కాలనీ, హైదరాబాద్
*పట్టుబడిన వారి వివరాలు:*
1. డి సంపత్ రావు s/o కిషన్ రావు 40 ఇయర్స్ వెలమ క్యాతన పల్లి
2. టి వెంకటేశ్వర్లు s/o రాజమౌళి 47 ఇయర్స్ వైశ్య సుల్తానాబాద్
3. నల్ల తిరుమల్ రెడ్డి s/o రాజిరెడ్డి 40 ఇయర్స్ కాపు మల్యాల
4. ఒడ్నాల శేఖర్ s/o లక్ష్మణ్ 39 ఇయర్స్ రజక పెగడపల్లి
5. కె నవీన్ రెడ్డి s/o కిషన్ రెడ్డి 25 ఇయర్స్ కరీంనగర్
6. పెట్టం తిరుపతి s/o లింగారెడ్డి 35 ఇయర్స్ కరీంనగర్
7. ఆత్మకూరు రమేశ్ s/o రాజయ్య 24es మాదిగ పెగడపల్లి
8. వేముల రవి s/o నరసింహులు 37 ఎస్ పద్మశాలి గంగాధర
9. జారతి మోహన్ s/o మల్లయ్య 35 ఇయర్స్ కాపు మల్యాల
10. రాధాన్ల సాయి కుమార్ s/o మల్లేష్ 27yrs ముల్కల మంచిర్యాల
11. తోట రాజేందర్ s/o కిష్టయ్య 42 ఇయర్స్ కాపు ముల్కల మంచిర్యాల
12. మొమూరి నారాయణ రెడ్డి s/o రామ్ రెడ్డి 46 ఇయర్స్ చెన్నూరు మంచిర్యాల
13. రత్మ రాజేశ్వర్ రెడ్డి s/o బుచ్చిరెడ్డి 48ఇయర్స్ చెన్నూర్
14. కల్లూరి రవి s/o రాజన్న 38yrs కాపు చెన్నూరు
15. ఎడవల్లి పాపి రెడ్డి s/o ప్రతాపరెడ్డి 31 ఇయర్ శ్రీరాంపూర్
16. నడిపెల్లి శ్రీ రంగారావు s/o మాధవరావు 59ఇయర్స్ మంచిర్యాల
17. జి కె సలీం s/o అలిమోద్దీన్ 42 ఇయర్స్ మంచిర్యాల
18. గాడిచర్ల వీరేశం s/o శంకరయ్య 42 ఇయర్స్ ముదిరాజ్ మంచిర్యాల
19. గుండా సురేష్ s/o విశ్వనాథం 36yrs వైశ్య ధర్మపురి
20. చర్ల బాపురెడ్డి s/o రాజిరెడ్డి 62yrs, సీసీసీ నస్పూర్ మంచిర్యాల
21. చిలుక సురేష్ s/o లచ్చన్న 26s పద్మశాలి ధర్మపురి
22. ఎస్ కె అలీమ్ s/o ఎస్ కె బాయి,33yrs, మంచిర్యాల
23. కటకం మహేష్ s/o బాలయ్య 38 ఇయర్స్ కాపు మంచిర్యాల
24. బి.గోపాల్ s/o లచ్చయ్య 35 ఇయర్స్ పెరక మంచిర్యాల
25. మెరుపుల రవి s/o పెద్దలు 30 ఇయర్స్ మంచిర్యాల్
26. తమ్మిశెట్టి సత్యం s/o ఆగయా 45 ఇయర్స్ వైశ్య కరీంనగర్
27. టీ వాసుదేవ రెడ్డి s/o రాజ నరసింహ రెడ్డి 53yrs, కరీంనగర్
28. మహేందర్ రెడ్డి s/o కనక రెడ్డి 46 ఎస్ కరీంనగర్
29. కోటశ్రీనివాస్ s/o చంద్రమౌళి 31s పద్మశాలి కరీంనగర్
30. దొడ్డ రత్నాకర్ రెడ్డి s/o భూమ్ రెడ్డి 60yrs,కరీంనగర్
31. పెర్క రామారావు s/o రాజారావు 57s కరీంనగర్
32. ఏ. మహేందర్ s/o చంద్రయ్య,35yrs, మాదిగ గోదావరిఖని
33. మాదాసు శ్రీనివాస్ s/o శంకర్,30yrs, తెనుగు, కమాన్ పూర్
34. ఎరుకల రమేష్ s/o మల్లయ్య 22 ఇయర్స్ కమాన్‌పూర్
35. పాత బాబు s/o శంకరయ్య 70 ఇయర్స్ వైశ్య కమాన్‌పూర్
36. శ్రీ రాముల మురళి s/o భూమయ్య 56yrs జగిత్యాల
37. సంగీని భట్ల శ్రీకాంత్ s/o కిష్టయ్య 40 ఇయర్స్ బ్రాహ్మణ ధర్మపురి
38. రాసు శ్రీనివాస్ చంద్రయ్య 24 ఇయర్స్ పెగడపల్లి
39. మాదారపు శ్రీధర్ s/o శంకరరావు 45 ఇయర్స్
40. వేముల కిష్టయ్య s/o నారాయణ 50 ఇయర్స్ పద్మశాలి ఎన్టిపిసి రామగుండం
41. సిద్ధం రామచంద్రం s/o మల్లయ్య ,ఇయర్స్ మున్నూరుకాపు ఎన్టిపిసి రామగుండం
42. బుర్జ కింది హనుమాన్లు s/o గౌడ్ రాములు 50 ఇయర్స్ గౌడ ఎన్టిపిసి రామగుండం
43. చెన్నూరు లక్ష్మణ్ s/o వెంకన్న 26yrs మాల నర్సంపేట్
44. వేల్పుగొండ రాజు s/o రాజయ్య ,నర్సంపేట ( పరారీలో ఉన్నాడు )
45. ఏ రవి కుమార్, 33 ఇయర్స్ యాదవ ధర్మారం
46. కట్టె రమేష్ s/o రాజలింగం 20 ఇయర్స్ వడ్రంగి నంది మేడారం
47. ఎస్ వెంకటేష్ s/o చిన్నయ్య 54 ఇయర్స్ ధర్మారం
48. కొలిపాక రాజేశం s/o రాజమల్లు 40 ఇయర్స్ ముదిరాజ్ నంది మేడారం ధర్మారం
49. మాధురి నరేందర్ వీరేశం 36 వైశ్య కరీంనగర్
50. పుల్లూరి శంకర్ s/o కాశీనాథ్ 54 ఇయర్స్ వైశ్యా కరీంనగర్
51. నేరెళ్ల తిరుపతి s/o వెంకటయ్య 45 ఇయర్స్ చాకలి కరీంనగర్
52. దొడ్ల తిరుపతి రెడ్డి s/o రాఘవ రెడ్డి 49ers కరీంనగర్
53. దాసరి శ్రీనివాస్ s/o మల్లేశం 36yrs సిద్దిపేట
54. గంట రమేష్ s/o హనుమంతు 35yrs గౌడ గోదావరిఖని
55. కె నాగరాజు s/o బాలయ్య 45yrs గౌడ సిద్దిపేట
*స్వాదీనం చేసుకున్న వాటి వివరాలు*
1. 6 లక్షల నగదు,
2. 18 కార్లు ,
3. 62 సెల్ ఫోన్ లు స్వాధీనం
పేకాట రాయుళ్లు పట్టుకోవడంలో పాల్గొన్న తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు ,టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రాజ్ కుమార్, కిరణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ లు మస్తాన్, కిరణ్ కుమార్,లచ్చన్న,ఎస్ఐ తాండూర్ శేఖర్ రెడ్డి , టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, రమేష్, ప్రకాశ్, మల్లేష్, వెంకటేష్,ఓంకార్, భాస్కర్,శ్యామ్, మహేందర్, సంపత్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ని సీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డిసిపి సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నారాయణ, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రాజ్‌కుమార్, కిరణ్,తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ మస్తాన్ పాల్గొన్నారు.