భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం : భద్రాచలం ASP తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం డివిజన్ చర్ల మండలంలో శనివారం తెల్లారుజామున చర్ల పోలీసు సిబ్బంది మరియు CRPF సిబ్బంది కలసి చర్ల మండలం లోని చింతగుప్పా అటవీ ప్రాంతంలో ఏరియా డామినేషన్ నిర్వహించు చుండగా, ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. పోలీసులను చూసి ఆ ముగ్గురు పారిపోతుండగా పోలీసు సిబ్బంది వెంబడించి పట్టుకుని విచారించగా వారు 1)ఇర్ప రామారావు(30), S/O జోగయ్య, నిషిద్ధ CPI మావోయిస్టు పార్టీ RPS కమిటీ, R/O కుర్నపల్లి, చర్ల మండలం; 2) ఇర్ప సత్తిబాబు(22), S/O క్రిష్ణ, నిషిద్ధ CPI మావోయిస్టు పార్టీ కొరియర్, R/O కుర్నపల్లి, చర్ల మండలం; మరియు 3) మరొక వ్యక్తి మావోయిస్టు మిలిసియ మెంబర్ అని నిర్ధారణ అయింది. వీరి వద్ద గల గోనె సంచిలో 25 గెలిటిన్ స్టిక్స్ ను స్వాధీన పరుచుకోవడం జరిగిందని వీరు గతంలో కొన్ని నక్సలైట్ల సభందిత కేసులలో నేరచరిత్ర కలిగివుండి మరియు ఈ మధ్య చర్ల మండలం అటవీ శాఖ అధికారులను బెదిరించిన కేసులో కూడా వీరు ముగ్గురు కూడా ఉన్నారని భద్రాచలం ASP తెలియజేశారు.