కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సోమవారం రాత్రి ఘనంగా అంతర్జాతీయ వాలంటీర్స్ డే లయన్స్ క్లబ్ గన్నేరువరం ఆధ్వర్యంలో జరిగింది స్వచ్ఛందంగా పోలీస్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్న పోలీస్ వాలంటీర్స్ ను లయన్స్ క్లబ్ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ఆవుల తిరుపతి,డిస్టిక్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న పాల్గొని పోలీస్ వాలంటీర్స్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం వారికి మాస్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ వాలంటీర్స్ లకు ఖర్చుల కింద లయన్ బుర్ర జనార్దన్ గౌడ్ వెయ్యి రూపాయలు ఎస్సై ఆవుల తిరుపతి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బూర శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి బొడ్డు సునీల్,న్యాత సుధాకర్, తెల్ల భాస్కర్ కాంతాల కిషన్ రెడ్డి,బుర్ర జనార్దన్ గౌడ్,లియో అధ్యక్షుడు గంట గౌతమ్,శివ సాయి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు