కరీంనగర్ జిల్లా మానకొండూర్ అలుగునూర్ చౌరస్తా వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. లారీ బాడీ ఛాసిస్ రెండు భాగాలుగా విడిపోయి రోడ్డుపై పడింది. వివరాల్లోకి వెళితే కర్నూలు నుంచి వడ్ల లారీ సుల్తానాబాద్‌కు వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న లారీ బాడీ, ఛాసిస్ వేరు కావడంతో లారీ కొద్ది భాగం రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రహదారిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీనీ క్రేన్ సాయంతో రోడ్డుపై నుండి తొలగించి…. ట్రాఫిక్ క్లియర్ చేశారు