ఫిబ్రవరి 14వ తేదీన మరో లేగదూడ పై అడవి జంతువు దాడి – చికిత్స పొందుతూ మార్చి 9వ తేదీన లేగదూడ మృతి – పోస్టుమార్టం చేసిన వైద్య బృందం – ఫారెస్ట్ అధికారులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక సమీపంలో గత నెల ఫిబ్రవరి 14వ తేదీన చాకలివాని పల్లె గ్రామ పరిధిలోని కూనవాని పల్లెకు చెందిన కూన చంద్రశేఖర్ చెందిన లేగదూడ పై అడవి జంతువు దాడి చేసిన విషయం తెలిసిందే లేగదూడ చికిత్సపొందుతూ మార్చి 9వ తేదీ రాత్రి మృతి చెందింది మార్చి పదో తేదీన ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా తిమ్మాపూర్ ఇంచార్జి సుజాత రెడ్డి, వైద్య బృందం, సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం చేసి జెసిబి తో మట్టిని తీసి దూడను పూడ్చి పెట్టారు బాధితుడు కూన చంద్రశేఖర్ కు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ఫారెస్ట్ అధికారి సుజాత రెడ్డి తెలిపారు