రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 3న నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతు అన్నారు. మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఉదయం 10 గంటల నుంచి సర్దార్ పటేల్ స్టేడియంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో 65కి పైగా కంపెనీలు పాల్గొని 5,000కు పైగా ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నాయి. నిరుద్యోగ యువత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగం అప్లై చేసుకునే వారు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 8886711991, 9642333668లను సంప్రదించండి.