మణిపూర్ హర్యానా తదితర రాష్ట్రాల దాడులకు బాధ్యత వహించి కేంద్ర రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల నాయకులు ఈరోజు పిడుగురాళ్ల మసీద్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలకు పైగా మణిపూర్లో మహిళలపై అత్యాచారాలు నగ్న ప్రదర్శనలు యువకులపై దాడులు హత్యలు గృహదహనాలు చర్చిలు కూల్చివేతలు భారీగా ఆస్తి నష్టంకు మైతీలు పాల్పడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుండా మౌనం దాల్చడం జరుగుతుంది ఇది ఇలా ఉండగా ఈరోజు హరియానాలో కూడా ఈ దాడులు వ్యాపించడం గమనిస్తే దేశవ్యాప్తంగా బిజెపి కాలు మోపిన ప్రాంతం పరిస్థితులు దారుణంగా ఉన్నవి ఇప్పటికే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన చట్టాలను తొలగించి 2024 లో అధికారంలోకి వస్తే పూర్తిగా మార్చి మను శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గపు చర్యలను మానుకొని బిజెపి పాలకులు వెంటనే రాజీనామా చేయాలని ఇలాంటి చర్యలను ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు,
ఎం సి పి ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణ నాయక్ , ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ కే సర్దార్ పాల్గొన్నారు.