భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాషగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కొర్సగూడ అటవీ ప్రాంతంలో బాసగూడ పోలీసులు, రిజర్వ్ గార్డ్ సిఆర్పిఎఫ్ 168 బెటాలియన్ సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడిన నేపధ్యంలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరిగినట్టు ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చేదినట్టు వివరాలు తెలిపిన బీజాపూర్ జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్. మృతి చెందిన మావోయిస్టు మీద లక్ష రూపాయలు రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.