భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం: భద్రాచలం పట్టణ సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం పట్టణ ఎస్. ఐ మహేష్ కూనవరం రోడ్ N.T. R విగ్రహం నుండి పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తుండగా టాటా ఇండిగో మాంజా AP 09 CC 2789 అనే కారు అనుమానాస్పదంగా వెలుతూ కనిపించగా అట్టి కారును ఆపి తనిఖీ చేయగా అందులో నిషేదిత గంజాయి ఉండడాన్ని గమనించారు. కారు డ్రైవర్ ని వివరాలు అడిగి తెలుసుకోగా డ్రైవర్ పేరు వాంకుడోతు బాల కుమార్ తండ్రి వాల్య, వయస్సు 33 , నివాసం కలకత్తా తండా, గూడూరు మండలం, మహబూబ్బాద్ అని, చట్టి నుండి గంజాయి ని హైదరాబాద్ కు తరలిస్తున్నడని సమాచారం. పట్టుబడిన గంజాయి 204 కేజీలు ఉండగా విలువ సుమారు 30,60,000/- ఉంటుందని , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు.