అమరావతిలోని సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులను ఛేదించుకుని పోలీసులు సచివాలయం మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. నలువైపుల నుంచి సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారు. జాతీయ జెండాలను చేతబట్టి ముందుకు వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. సేవ్ అమరావతి అంటూ వారు నినదిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు సచివాలయం పక్కనే ఉన్న చెరువులోకి దిగి నినాదాలు చేస్తున్నారు.