మన భూమిలా ఉన్న మరో ప్రపంచాన్ని నాసాకు చెందిన ప్లానెట్ హంటర్ శాటిలైట్ ‘టెస్’ గుర్తించింది. ఈ గ్రహంపై నీరు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. హొనొలూలులో అమెరికన్ ఆస్ట్రోనామికల్సొసైటీ నిర్వహించిన వార్షిక సమావేశంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటర్ ఈవిషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా నాసా ఆస్ట్రో ఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్హెర్ట్జ్ మాట్లాడుతూ, మన సమీపంలోని ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నగ్రహాల్లో. భూమి సైజులో ఉండే గ్రహాలను గుర్తించేందుకు టెస్ శాటిలైట్ నుప్రయోగించామని తెలిపారు. టెస్ గుర్తించిన గ్రహానికి ‘TOI700 D’ అని నామకరణంచేశారు. ఇది భూమికి అత్యంత దగ్గరగా. కేవలం 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.2018లో టెస్ ను నాసాప్రయోగించింది. భూమిని పోలిన గ్రహాన్ని టెస్ గుర్తించడం ఇదే తొలిసారి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )