- మంత్రి హరీష్ రావు తన స్వంత గ్రామంలో పేద దళిత కుటుంబాలు కనిపిస్తాలేవ ?
- దత్తత గ్రామంలో అర్హులకు ఇండ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే
- పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు.
సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం తోటపెల్లి గ్రామంలో శనివారం బీఎస్పీ పార్టీ చేపట్టిన ఆర్ఎస్పి మన ముఖ్య మంత్రి అభ్యర్థి ఇంటింటికి ప్రచారం రెండవ రోజులో భాగంగా తోటపెల్లి గ్రామంలో పాల్గొన్న బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తోటపెల్లి గ్రామంలో ఉన్న దళిత కుటుంబాల పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని మంత్రి హరీష్ రావు స్వంత గ్రామంలో అర్హులైన దళిత కుటుంబాలు గృహలక్ష్మి పథకం అమలుకు నోచుకోలేదు. తోటపెల్లి గ్రామానికీ చెందిన కనుకుంట్ల అంజయ్య ( భార్య చనిపోయింది, ఇద్దరు పిల్లలు అందులో ఒకరు వికలాంగులు, గుంట భూమి లేదు, ఉపాధి లేదు, తన పాత ఇల్లు పూర్తీగా శిధిలావస్థలో కులీ పోయే విధంగా ఉన్నందున గృహ లక్ష్మి పథకంలో ఇల్లు కోసం అప్లికేషన్ చేసుకోగా తన భార్య చనిపోయిన కారణంగా నీకు అర్హత లేదని తిరస్కరించడం చాలా సిగ్గు చేటు నిజమైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడానికి కేవలం మహిళ పేరిట దరఖాస్తు చేసుకోవలనడం, పథకాలకు వారిని దూరం చేయడమే ప్రభుత్వల పని తీరుతో ఈ రోజుల్లో భార్య లేని నాయకులు రాజకీయంగా దేశ, రాష్ట్ర స్థాయిలలో పదవులు అనుభవించడానికి అనువుగా వ్యవహరిస్తున్నాయి తప్ప ఓట్లు వేసిన పేదవాళ్ళు ఇండ్లు కోసం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేని విధంగా షరతుల పథకాలు పేట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ మరోసారి మానకోండూర్ స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు బిఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి హరీష్ రావు తన స్వంత గ్రామంలో దళిత కుటుంబాలు కనిపిస్తాలేవ ? ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉపాధి లేని ఈ కుటుంబానికి దళిత బందు మరియు గృహ లక్ష్మి పథకం క్రింద వెంటనే ఇల్లు మంజూరు చేయాలని బీఎస్పీ పార్టీ తరుపున మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే బీఎస్పీ వారికి అండగా ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే మరియు స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కరీంనగర్ జిల్లా కార్యదర్శి & అసెంబ్లీ ఇంఛార్జి ఎగోలపు వెంకన్న గౌడ్, మానకోండూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నీషాని రాజమల్లు, అసెంబ్లీ బీట్ సెల్ ఇంఛార్జి ఉప్పులేటి శ్రీనివాస్, బెజ్జంకి మండల అధ్యక్షులు మాతంగి తిరుపతి, ఉపాధ్యక్షులు కాంపెల్లి నరేష్, నాయకులు నేదరి మల్లేశం శ్రీనివాస్, బండి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.