contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మళ్లీ మారుతి 800 కారు మాకెట్లోకి … ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !

 

మారుతి 800 దశాబ్దాలుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్. ఒకప్పుడు కారు అంటే కేవలం మారుతి 800 మాత్రమే ఉందా…అనే రేంజులో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేశాయి. రాను రాను మార్కెట్లో వచ్చిన కొత్త కార్ల పోటీతో మారుతి తన బేస్ మోడల్ ను నిలిపి వేసి. ఆల్టో 800కు పరిమితం అయ్యింది. అయితే ఈ కారును ఎనభైలలో దేశంలో మొట్టమొదట లాంచ్ చేశారు, కాలక్రమేణా ఈ కారులో చాలా మార్పులు చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారును కొత్త అవతారంలో మరోసారి లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి.గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి ప్రతినిధి మాట్లాడుతూ.., కంపెనీ స్మాల్ బడ్జెట్ ధరలో కొన్ని చిన్న కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. మీడియా నివేదికల ప్రకారం మరోసారి Maruti 800 కారు రాబోతుందనే, వార్తలు జోరందుకున్నాయి. రాబోయే కారు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. మీడియాకు అందిన లీకుల ప్రకారం మారుతి కొత్త 800 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం: మార్కెట్లో రెండు కొత్త చిన్న కార్లను ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది, ఇందులో 800 సిసి సామర్థ్యం గల కారు కూడా ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం కంపెనీ పని ప్రారంభించినట్లు సమాచారం. ఈ కార్ల గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే వాటి ధర 3 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉంటుంది. 800 సిసి ఇంజన్ సామర్థ్యం కాకుండా, ఇతర కార్లలో 1 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను కంపెనీ ఉపయోగించనుంది. వాస్తవానికి, ఈ కార్లతో ఎంట్రీ లెవల్ విభాగంలో తన పట్టును కొనసాగించాలని కంపెనీ కోరుకుంటోంది.

ఇంజిన్ సామర్థ్యం:

ఊహించినట్లుగానే, కంపెనీ 3 సిలిండర్ ఇంజిన్‌తో 796 సిసి సామర్థ్యాన్ని తన కారులో ఉపయోగించుకుంటుంది. ఇది 48 పిఎస్ శక్తిని, 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అటు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఈ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చు.

లుక్ డిజైన్:

పాత కారుతో పోల్చితే Maruti 800 డిజైన్ కొద్దిగా మార్చవచ్చు. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ కారును తన హియర్టెక్-కె ప్లాట్‌ఫామ్‌లో నిర్మించనుంది. ఇప్పటికే విడుదల చేసి మారుతి ఎస్-ప్రెస్సో డిజైన్ తరహాలో కొత్త Maruti 800 మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ధర:

ఈ కారులో,స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందు పరచనున్నారు. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు కనెక్ట్ చేయవచ్చు. ఇక పవర్ విండోస్, ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, వీల్ క్యాప్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) వంటి ఫీచర్లను కూడా అందించవచ్చు. కంపెనీ ఊహించినంతవరకు, ఈ కారును రూ. 3 లక్షల కన్నా తక్కువకు లాంచ్ చేస్తుంది.

గమనిక: కొత్త మారుతి 800 గురించి ఇక్కడ పేర్కొన్న అన్ని విషయాలు మీడియా నివేదికల ఆధారంగా ఉన్నాయి. ప్రస్తుతం, ఈ కారు గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే కంపెనీ త్వరలో మారుతి 800 ను కొత్త అవతారంలో ప్రవేశపెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :