కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో సిఎం కెసిఆర్ జన్మదిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన కేసీఆర్ వీరాభిమాని బత్తుల వెంకటేష్ కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల,గ్రామస్థుల సమక్షంలో కేసీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి 10కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ కెసిఆర్ అంటే కు తమకు ఎంతో అభిమానమని,తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల చిన్నయ్య,బత్తుల కనుకవ్వ, గంగ,బత్తుల రజిత తదితరులు పాల్గొన్నారు