కరీంనగర్ జిల్లా : రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా ప్రజాగాయకులు, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ని నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సీఎం కేసిఆర్ ఆశీస్సులతో రసమయి 3వ,సారి సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా నియమితులయ్యారు. 14 ఏళ్ల పాటు ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలంగాణ ఉద్యమంలో రసమయి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కళాకారులతో ధూంధాం కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిర్వహించారు.తమ ఆటపాటలతో తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన రసమయికి కేసీఆర్ మరోసారి సారథి బాధ్యతలు అప్పగించారు తమపై ఉన్న నమ్మకంతో 3వ, సారి సారథి ఛైర్మెన్ గా నియమించినందుకు కేసీఆర్ కి రసమయి కృతజ్ఞతలు తెలిపారు
