contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతులకు సెంటు భూమి కూడా నష్టం రానివ్వం-అఖిలపక్షం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి ఖమ్మం-వరంగల్ జిల్లాలో సుమారు 2 లక్షల ఏకరాలకు నీళ్ళు అందిచే విధంగా  దుమ్ముగూడెం మండలంలో గోదావరి తీర ప్రాంతంలో నిర్మించే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు, ఇండ్లు, పంట పొలాలు నష్ట పోతున్న చర్ల మండలానికి చెందిన భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని సోమవారం చర్లలో చర్ల మండల అఖిలపక్ష నాయకుల ఆద్వర్యంలో జరిగిన సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక కార్యక్రమంలో   భూ నిర్వాసితులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని అఖిలపక్ష రాష్త్ర, జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. రైతులకు సెంటు భూమిని కూడా పోనివ్వం అంటూ అఖిల పక్షం నాయకులు ముక్తకంఠంతో  రైతులకు బరోసా ఇచ్చారు. 

అఖిలపక్షం తీర్మానించిన డిమాండ్లు:

1.సీతమ్మ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి నిర్వాసితులను ముంపు నుండి కాపాడాలి. 

2. 2013 భూ నిర్వాసితుల చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి.

3. భూమి కోల్పోయే రైతులందరికి భూమికి బదులు భూమి చూపించాలి లేని పక్షంలో, ఎకారానికి 40 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి.

4. గోదావరి లంక భూములకు కూడ నష్టపరిహారం చెల్లించాలి.

5. పట్టాలు లేని గిరిజన గిరిజనేతరుల సాగులో ఉన్న రైతులందరికి నష్టపరిహారం ఇవ్వాలి.

6. వ్యవసాయ భూముల్లోని చెట్లు, బోర్లు, షెడ్లకు కూడ నష్టపరిహారం అందించాలి.

7. ముంపు ప్రాంతాల్లోన్ని , ఇండ్లు, స్థలాలు కోల్పోయే నిర్వాసితులకు కూడ నష్టపరిహారం ఇవ్వాలి. 

8. సాగు భూమిపై పని చేయుచున్న వ్యవసాయ కూలీలకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి .

 9. సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణ ( డిజైను ) నమూనాలను గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియ చేయాలి . 

10. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు సర్వేను నిలుపుదల చేయాలి.

అనంతరం సమావేశ ప్రాంగణం నుండి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రైతులు, అఖిలపక్ష నాయకుల ఆద్వర్యంలో దర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పొడెం వీరయ్య, మాజీ ఎంపీ సీపీఎం సీనియర్ నాయకులు మీడియం బాబురావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర కార్యదర్శి  కుంజ సత్యవతి, చర్ల మండల  ZPTC ఇర్పా శాంత, MPP కోదండ రామయ్య, CPI రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వర రావు గారు, సీపీఎం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, భాజాపా జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్, కాంగ్రెస్ భద్రాచలం డివిజన్ ఇంచార్జి నల్లపు దుర్గా ప్రసాద్, CPM డివిజన్ నాయకులు చీమల మర్రి మురళి, తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు, 500 మంది పైగా  చర్ల మండల రైతులు భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

సుమారు రెండు గంటల పాటు ధర్నా జరిగిన అనంతరం, మండల తశీల్దార్ అనిల్ కుమార్ వచ్చి పై అధకారులకు విషయం తెలియజేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని  హామీ ఇచ్చిన తర్వాత రైతులు, నాయకులు ధర్నాను  విరమించారు. అనంతరం సిఐ అశోక్ ఆదేశాల మేరకు ఎస్ఐ రాజువర్మ పరిస్థితిని అదుపు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :