లాక్ డౌన్ ని పటిష్టముగా అమలు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి అన్నారు ..లాక్ డాన్ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. గత సంవత్సరం కొనసాగిన లాక్ డౌన్ సందర్భంలో కేసులు నమోదైన వారు ఇంకా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నార నే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని చెప్పారు… లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి ఎలాంటి కారణాలు లేకుండా వచ్చే వారి వాహనాలు సీజ్ చేయడంతోపాటు, న్యాయస్థానాల్లో డిపాజిట్ చేస్తామని తెలిపారు… కరోనా వైరస్ వ్యాప్తి రెండవ దశ ఉధృతి కొనసాగుతున్నoదున కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది అని చెప్పారు.. వైరస్ వ్యాప్తి ఉధృతి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు…నియంత్రణ చర్యల ద్వారానే వైరస్ వ్యాప్తిని నియంత్రణ చర్యల ద్వారానే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు అని చెప్పారు . అత్యవసర సేవలందించే విభాగాల్లో ఉన్న ఉద్యోగులు కూడా విశ్రాంతి సమయంలో ఇంట్లోనే ఉండాలని అనవసరంగా బయటకు రావద్దని సూచించారు …లాక్ డౌన్ అమల్లో భాగంగా అన్ని మతాలకు చెందిన ప్రార్థన మందిరాలు స్థలాలలో ప్రజలకు ఎలాంటి ప్రవేశం లేదని ఆయా ప్రార్థన మందిరాలలో ఒక మత పెద్ద మాత్రమే ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు…. అత్యవసర పరిస్థితి ఏర్పడి ఇతర ప్రాంతాలకు వెల్లదలచిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ పాస్ పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు… వైరస్ వ్యాప్తి మొదటి దశలో అన్ని రకాల జాగ్రత్తలు నియంత్రణ చర్యలు తీసుకొని సఫలీకృతమైన అన్ని వర్గాల ప్రజలు అదే స్ఫూర్తితో వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తి ఉధృతి నియంత్రణ చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు . ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్. శ్రీనివాస్(ఎల్ అండ్ ఓ) జీ.చంద్రమోహన్(పరిపాలన ), పి.అశోక్(టౌన్ డివిసన్) ల తో పాటు వివిధ స్థాయిలకి చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.