విశ్వవిద్యాలయ చరిత్రలో మొట్టమొదటి సారిగా డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు పాల్గొని డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ డా. వై ఎస్ ఆర్ గారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ముఖ్యమంత్రులలో ముఖ్యులని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలను అతిదగ్గరగా చూసి చలించి పోయి తాను ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సారె అనేక ప్రజా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారని. తద్వారా ఎంతో మంది పేదల గుండెల్లో దేవుడిగా కొలువు దీరారని అన్నారు. తన విశేష రాజకీయ అనుభవం వలన సామాజికస్పూర్తి మరియు ప్రజా నీతి కలిగినటువంటి మహావ్యక్తి అని ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వికరించిన వెంటనే ఆర్థికాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం అనే రెండు లక్ష్యాలను నిర్దేసించుకొని తదనుగుణంగా విదాన పరమైన చర్యలు చేపట్టారని అన్నారు. వ్యవ్యవసాయం ప్రధాన రంగంగా కలిగిన రాష్టంఅని గుర్తించి జల యగ్నం కార్యక్రమాని ప్రారంబించడం జరిగిందన్నారు. అలాగే, విద్య ఆరోగ్యం అందరికి అందాలని అప్పుడే నిజమైన అభివృద్ధి అని భావించి ఈ రెండు రంగాలకు విశేష ప్రాదాన్యత ఇస్తూ ఫీజు రీయింబర్సుమెంట్ , ఆరోగ్యశ్రీ, మరియు 108 వంటి పధకాలు ప్రారంబించి నేటికికుడా ప్రజల హృదయాలలోఒక ప్రత్యేకమైన స్తానాన్ని సంపాదించుకొగలిగారు అన్నారు. రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ, డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారితో మంచి సాన్నిహిత్యం ఉండేదని, ఉన్నత భావాలు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. స్నేహితులకు, నమ్మిన వారికి, నా అనుకున్న వారికి ప్రాణమిచ్చే గొప్ప స్నేహశీలి అని తెలిపారు. ప్రతిజిల్లాలకు విశ్వవిద్యాలయం ఉండాలన్న ఆలోచన ఆయనదేనని, తనకున్న ముందు చూపుతో, 2008 లో నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతో పాటు వివిధ జిల్లాలో మరో ఐదు విశ్వద్యాలయాలను స్థాపించారన్నారు. ఈ రోజు మన విశ్వవిద్యాలయం నుంచి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యనభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారన్నారు. ఇటువంటి జనాదరణ పొందిన రాజకీయ నాయకులు బావితరాలకు స్పూర్తిదాయకం అని అన్నారు . అలాగే, భాహుముఖ ప్రజ్ఞాశాలి రాజనీతిజ్ఞుడు, భారతరత్న, పద్మవిభూషణ్, 13వ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ప్రనబ్ ముఖర్జి గారికి కూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య, రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి, ఇతర అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.