విక్రమ సింహపురి యూనివర్సిటీలో మంగళవారం ప్రీ రిపబ్లిక్ డే క్యాంపు ఎంపికలు జరిగాయి. విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (NSS) సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. నవంబర్ లో అనురాగ్ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రీ రిపబ్లిక్ డే క్యాంపులో పాల్గొనే విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మంగళవారం వి.యస్.యులో జరిగింది సెలక్షన్ కమీటీ సభ్యులు డా. ప్రవీణ్, మరియు డా. నిలమణికంట పరుగు పందెం,మార్చ్ ఫాస్ట్,శారీరక దారుణ్య పరీక్షలు నిర్వహించారు వి.యస్.యూ పరిధిలోని కళాశాలలో నుంచి 80 మంది ఈ ఎంపికకు హహరు కాగా కృష్ణ చైతన్య నుంచి నలుగురు,కావలి జవహర్ భారతి నుంచి ఇద్దరు,వియర్ నుంచి ఇద్దరు,జగన్స్ మరియు ఒకరు,రామకృష్ణ కళాశాల నుంచి ఒకరు ఎంపిక అయ్యారు మొదటగా ఇద్దరు విద్యార్థులను క్యాంపుకు పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం (NSS) ప్రోగ్రామ్ ఆఫీసర్లు,సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.