కరీంనగర్ పట్టణం : కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఉండేలా చూడాలని కోరారు. ఈ రోజు సచివాలయం నుండి DM&HO తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశాలనుండి రాష్ట్రం కి వచ్చిన ప్రతి వ్యక్తి డాటా ఉండాలని, వారిని ట్రాక్ చేయాలని మంత్రి సూచించారు. కరీంనగర్ కి గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా , ఉజ్బెకిస్తాన్ వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్య అధికారి తెలిపారు. అదే విధంగా అన్ని జిల్లాలకు వచ్చిన వారి వివరాలు సేకరించి ఇసొలేష న్ లో ఉంచాలని సూచించారు. భయం పోగొట్టేందుకు సెక్రెటరి స్థాయి నుండి ఆశ వర్కర్ వరకు అందరూ పనిచేయాలని తెలియజేశారు. దీనికి జిల్లాల్లో జిల్లా వైద్య అధికారులు భాద్యత వహించాలి అని మంత్రి తెలిపారు. సిబ్బంది, డాక్టర్స్ సమయపాలన చేయకపోయినా, విధులు సరిగా నిర్వహించ క పోయినా ఉపేక్షించేది లేదని సస్పెండ్ చేయాలని అధికారుల ను ఆదేశించారు. పని చేయని వారిని తొలగించాలని చెప్పారు. బాగా పనిచేయండి గౌరవం పెంచుకోండి అని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని, పేషంట్ల రద్దీకి అనుగుణంగా డాక్టర్స్, సిబ్బంది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో DM&HO సుజాత తదితరులు హాజరయ్యారువచ్చే మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ లో ఆశ వర్కర్స్, వైద్య సిబ్బంది కోవిడ్-19 అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కోరారు. కరోనా వైరస్ పై యుద్దం చేద్దామన్నారు. అవగాహన కల్పిస్తే విజయం మనదే అన్నారు. వైరస్ కేసులు నమోదు కాలేదు అని రిలాక్స్ అవ్వొద్దని మంత్రి సూచించారు