సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్–2020కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాజా నోటిఫికేష్ ద్వారా సీఆర్పీఎఫ్లోని గ్రూప్ బీ, గ్రూప్ సీలోని హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, కాంబటైజ్జ్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 789
ముఖ్య పోస్టులు– విద్యార్హతలు:
ఇన్స్పెక్టర్(డైటీషియన్): న్యూట్రిషన్ లేదా తత్సమాన సబ్జెక్టుతో బీఎస్సీ హోమ్‌సైన్స్/ హోమ్ ఎకనామిక్స్ లేదా ఎంఎస్సీ హోమ్ సైన్స్(ఫుడ్ అండ్ న్యూట్రిషషన్) ఉత్తీర్ణత.
సబ్ ఇన్స్పెక్టర్(స్టాఫ్ నర్స్): ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో మూడున్నరేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదుచేసు కొని ఉండటం తప్పనిసరి.
సబ్ ఇన్స్పెక్టర్ (రేడియోగ్రాఫర్): సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో పాటు రేడియోగ్రఫీలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఫార్మసిస్ట్): ఇంటర్ తత్సమాన అర్హతతోపాటు ఫార్మసీలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్(జూనియర్ ఎక్స్‌రే అసిస్టెం ట్/లాబొరేటరీ అసిస్టెంట్): పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ ఉండాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఫిజియోథెరపిస్ట్): సైన్స్‌తో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణతోపాటు ఫిజియోథెరపీలో మూడేళ్ల డిప్లొమా చేసుండాలి.
వయసు:
సబ్ ఇన్స్పెక్టర్: 30ఏళ్లు
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్: 20–25 ఏళ్లు
హెడ్ కానిస్టేబుల్ : 18–25 ఏళ్లు
హెడ్ కానిస్టేబుల్(జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్/లాబొరేటరీ అసిస్టెంట్/ ఎలక్ట్రీషియన్) : 20–25 ఏళ్లు
హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్), కానిస్టేబుల్: 18– 23 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు(పీఎస్టీ), ఫిజికల్ ఎలిజిబి లిటీ టెస్టు(పీఈటీ), రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రాత పరీక్ష: డిసెంబరు 20, 2020.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తు ఫీజు:
గ్రూప్ బీ అభ్యర్ధులు: రూ. 200
గ్రూప్ సీ అభ్యర్ధులు: రూ.100.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: crpf.gov.in