contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిస్టులపై దాడులు అంటే ప్రజాస్వామ్యంపై దాడులే: TRS

రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలంలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన విలేకరులు పొత్తూరి శేఖర్, రాతిపల్లి సంపత్‌లు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారి ఆదేశాల మేరకు, ఈరోజు తెలంగాణ రక్షణ సేన, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆసుపత్రికి వెళ్లి బాధిత జర్నలిస్టులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను భయపెట్టడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలే ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించాడం తీవ్రమైన విషయం. ఈ ఘటనను ప్రభుత్వం తేలికగా తీసుకోకూడదు. బాధితులకు న్యాయం జరిగే వరకు జర్నలిస్టులకు అండగా టిఆర్ఎస్ ఉంటుందని జర్నలిస్టులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేందుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విధి నిర్వహణలో భాగంగా ప్రశ్నలు అడిగే లేదా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులను వేధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని అన్నారు. జర్నలిస్టులపై దాడులను సాధారణ ఘటనలుగా పరిగణించి విస్మరిస్తే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నాయకులు హెచ్చరించారు.

పాత్రికేయుల భద్రతకు హామీ ఇవ్వాలని, విధి నిర్వహణలో వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదు. బాధితులకు న్యాయం జరిగే వరకు, పాత్రికేయుల హక్కులు మరియు భద్రత పరిరక్షించబడే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం అని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, మ్యాకల తిరుపతి, బసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, చిట్టంపల్లి నాగరాజు, పల్లె శారద, కొత్తూరి రఘ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :