పల్నాడు జిల్లా – మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 36వ వార్డు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా “జర్నలిస్టు పోలేపల్లి ఆనంద్” భార్య రామ తులసికి పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది.
వైసీపీ తరఫున 36వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామ తులసి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి వైసీపీ నాయకులు గెల్లెపోగు సామేలు, ఆకులపల్లి రమేష్ మద్దతుగా నిలిచి నామినేషన్ను బలపరిచారు.
మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో రామ తులసికి వైసీపీ అధిష్ఠానం అవకాశం కల్పించడం, ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 36వ వార్డులో ఆమెకు లభించే ప్రజా మద్దతు, ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.








