contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ సమరభేరి

గోదావరిఖని : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “చలో హైదరాబాద్” మహాధర్నా పోస్టర్లను మంగళవారం రామగుండం ఆర్‌జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 కృషి భవన్లో ఆవిష్కరించారు.

పిట్ కమిటీ నాయకులు, కార్మికుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్ 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచి ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరారు. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వాలను డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

మొదటి రోజు అక్టోబర్ 25న పారిశ్రామిక రంగ కార్మికులు, ప్రైవేట్ పరిశ్రమల ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

రెండో రోజు అక్టోబర్ 26న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, బీడీ కార్మికులు, మున్సిపల్, వైద్య సిబ్బంది, రవాణా కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పెన్షనర్లు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు.

కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమని, ప్రభుత్వాలు దిగివచ్చేలా కార్మికవర్గ ఐక్యతను చాటేందుకు ప్రతి కార్మికుడు, ఉద్యోగి స్వచ్ఛందంగా ఈ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరసాంబరావు, రాంప్రసాద్, వినేష్తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :