contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముంపు తీవ్రత తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి: పౌర సంక్షేమ సంఘం

కాకినాడ – తుఫాను ప్రభావంతో పాటు పౌర్ణమి తిథి కారణంగా సముద్రంలో అత్యంత బలమైన “పెద్ద పోటు” పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రతను తగ్గించేందుకు అధికారులు తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.

పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ప్రధాన అవుట్‌లెట్ గేట్లు మరియు ఉప్పుటేరు అనుసంధాన లాకులను మూసివేసి సముద్రం నుంచి ఉప్పునీరు నగరంలోకి ప్రవేశించకుండా పూర్తిగా అరికట్టాలని కోరారు. అయితే ఈ చర్యలతో నగరంలో కురిసే భారీ వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లే మార్గం తాత్కాలికంగా మూసుకుపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉండి ఇళ్లు మునిగిపోకుండా ఉండేందుకు ఉప్పుటేరు ప్రధాన పంపింగ్ స్టేషన్లతో పాటు అన్ని కీలక ప్రాంతాల్లో అధిక సామర్థ్యం గల హై-పవర్ మోటార్ పంపులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. అవసరమైన సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నీటిని బయటకు పంపించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను కోరారు.

వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :