contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైఎస్ జగన్‌ను కలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతర పరిస్థితులపై ఆయన పార్టీ అధినేతకు వివరించారు.

ఎన్నికల సమయంలో జిల్లాలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు జరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలపై జరిగిన దాడులు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేశాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ఆయా ఘటనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం నమోదైన సంఘటనలు, పార్టీ నాయకులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఆయన అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర వివరాలను పార్టీ అధిష్ఠానానికి అందించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాధిత నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :